Wednesday, December 25, 2024

త్వరలో బిజెపి అభ్యర్థుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

నేనెక్కడ పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడో మర్చిపోయారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చుట్టు ఉన్న వాళ్లంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులేనని చెప్పారు. ఎన్నికలొస్తుండటంతో ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని.. మరోసారి కెసిఆర్ చేతిలో మోసపోవద్దని సూచించారు. తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీని సంకనేసుకున్నడు.

కెసిఆర్ లెఫ్ట్, రైట్ ఉన్నోళ్లంతా ఉద్యమద్రోహులే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ పోటీ చేయాలి? అనే విషయంపై అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై దీక్ష చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న డికె అరుణను అడ్డుకుని స్టేషన్‌కు తరలించడం దుర్మార్గం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News