Tuesday, January 14, 2025

హోలీలోగా అభ్యర్థుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

పార్టీ కోసం కష్టపడే వారికి ప్రభుత్వంలో చోటు కల్పిస్తాం

పార్టీకి బలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో పని చేయండి

వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం

మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలి
మల్కాజిగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : హోలీ పండుగలోగా అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నా బలం, నా బలగం మీరే అని, ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని, మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి సిఎం స్థాయికి ఎదిగేలా చేసిందని ఆయన తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ గెలుపు అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిదని ఆయన సూచించారు. మ ల్కాజిగిరి పార్లమెంట్ నేతలు, కార్యకర్తలపై సి ఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో సిఎం సమీక్ష నిర్వహించారు. మాల్గాజిగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పతనం 2019లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నుంచే మొదలైందని, తాను సిఎం కుర్చీలో కూర్చోవడానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలే కారణమని ఆయన ప్రశంసించారు. నాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై జెండా మోసి తనను ఎంపిగా గెలిపించారని ఆయన గుర్తుచేశారు. 2,964 బూత్‌ల్లోని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారన్నారు.
వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం
వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నామన్నారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసునుకున్నామని అన్నారు. మెట్రో, ఎంఎంటిఎస్ రావాలన్నా జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించు కోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా మల్కాజిగిరిలో పార్లమెంట్ పరిధిలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదని గుర్తుచేశారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలి
పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని ఆయన సూచించారు. నేడు సాయంత్రం కంటోన్మెంట్ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలని సిఎం సూచించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాలని ఆయన ఆదేశించారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. మనకు బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏడు అసెంబ్లీ నియోజక వర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రమంతా మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్
మల్కాజిగిరిలో అనుసరించే క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతటా అనుసరించేలా నిర్వహించాలని నాయకులకు సిఎం సూచించారు. మ్రల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిది అని అందువల్ల ప్రణాళికబద్దంగా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని సిఎం పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News