- Advertisement -
కల్వకుర్తి రూరల్ : అరెకటికలను కుల వృత్తుల వారిగా గుర్తించడం హర్షణీయమని అరెకటిక సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు కర్ణకోట సోమాజి, ఉపాధ్యక్షులు మల్లకేడి కొండల్, దండోత్కర్ ఎంకోజి, కళావతి బాయ్, లక్షం భాయ్, గణేష్, శంకర్, శ్రీను, జాంగిర్, అల్లాజి, రమణజి, జంగోజి, రామచందర్ జి, నరేష్‌లు పేర్కొన్నారు.
ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సిఎం కెసిఆర్‌కు, ఎమ్మెల్యే జైపాల్‌కు వారు కృతఙ్ఞతలు తెలిపారు.
అరెకటిక సంక్షేమానికి పాటు పడుతా : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
అరెకటిక సంక్షేమానికి పాటు పడుతానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. అరెకటిక సంక్షేమ భవనానికి కల్వకుర్తిలో స్థలం కేటాయించి కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -