Monday, January 20, 2025

నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు

21న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు

మనతెలంగాణ/యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదా ద్రి క్షేత్రంలో నేటి నుంచి కొండంత పండుగ వేడుకగా జరుగనింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 21 వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే ఉత్సవాలకు, వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ ఇఒ రామకృష్ణారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కొండపైన తన సమావేశ మందిరంలో చైర్మన్ నర్సింహ్మమూర్తి, ప్రధానార్చకులు నల్లింథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాడూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులతో కలిసి ఆదివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు తెలియజేస్తూ బ్రహ్మోత్సవాలకు రూ.కోటి 60 లక్షలు కేటాయించామని, ఉత్సవాల సమయంలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుం డా భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్ర ధాన ఘట్టాలైన 17న ఎదుర్కోళ్లు, 18న తిరుకల్యాణం, 19 దివ్యవిమాన రథోత్సవం జరుగుతుందని, 13 నుంచి 19వ తేదీ వరకు స్వామివారి అలంకార సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయని, 15 నుంచి 20 వరకు భక్తుల కోసం ధార్మిక సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం సాధారణ రోజుల కంటే స్వామివారి ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామనిని, ఆలయం లో ప్రసాద వితరణ చేపడతామనని, అన్నదానాన్ని కూడా ఎక్కువ మంది భక్తులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలు ఇలా..
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. 11న స్వస్తివచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 12న ధ్వజారోహణం, 13న ఉదయం మత్సావతారం, రాత్రి శేషవాహన సేవ, 14న ఉదయం వటపత్రసాయి అలంకారం, రాత్రి హంసవాహన సేవ, 15న శ్రీకృష్ణాలంకారం, రాత్రి పొన్నవాహన సేవ, 16న గోవర్ధన గిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవ, 17న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం, 18న ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 19న ఉదయం గరుడవాహన సేవ, రాత్రి దివ్యవిమాన రథోత్సవం, 20న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్ధస్నానం, రాత్రి దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర సిఎంతో పాటు మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో ఆలయ డిప్యూటీ ఇఒ భాస్కర్ శర్మ, ఎఇఒ శ్రావణ్‌కుమార్, రఘు, రమేష్‌తో పాటు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News