Wednesday, January 29, 2025

27 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబర్ 6వ తేదీతో ముగుస్తాయి. ఈనెల 27 న బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – లక్ష కుంకుమార్చన జరుగనుంది. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు – అంకురార్పణం – పుణ్యహవచనం, రక్షా బంధనం, సేనాధిపతి ఉత్సవం జరగనున్నాయి. 28 న గురువారం ఉదయం ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చిన శేష వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. 29 న శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పెద్దశేష వాహనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతారు.

30 న శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ముత్యపు పందిరి వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సింహ వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. డిసెంబర్ 1న ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబర్ 2న సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పల్లకీ ఉత్సవం, వసంతోత్సోవం జరుగుతాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహనంపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబర్ 3న మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సర్వ భూపాల వాహనం, మధ్యాహ్నం స్వర్ణరథం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబర్ 4న బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి.

డిసెంబర్ 5న గురువారం ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ జరగనున్నాయి. డిసెంబర్ 6న శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం ఘనంగా జరగనుంది. ఈ చక్రస్నాన ఉత్సవాన్ని పంచమితీర్థం అని కూడా అంటారు. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. డిసెంబర్ 7న శనివారం ఆలయంలో గురువారం జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసీ, తెలియక జరిగిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News