- Advertisement -
మోడెర్నా వ్యవస్థాపకుడు నూబార్ అఫేయన్
వాషింగ్టన్ : భవిష్యత్తులో ఏడాదికోమారు కరోనా టీకా తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని టీకా తయారీ సంస్థ మోడెర్నా వ్యవస్థాపకుడు నూబార్ అఫేయన్ వ్యాఖ్యానించారు. బ్లూంబర్గ్ టీవీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు బూస్టర్ డోసులు ఇవ్వాలా వద్దా అంటూ ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంటే నూబార్ మాత్రం ఏడాదికోమారు టీకాలు అంటూ వ్యాఖ్యానించారు. ఫ్లూ టీకాల మాదిరి గానే కరోనా వ్యాక్సిన్‌ను కూడా కనీసం ఏడాదికోమారు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అని ఆయన చెప్పారు. మోడెర్నా సంస్థ ఇటీవల సగం డోసు ఇస్తే సరిపోయే బూస్టర్ టీకాను అభివృద్ధి చేసింది.
Annual Covid booster may become reality says Noubar Afeyan
- Advertisement -