Sunday, December 22, 2024

ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!

- Advertisement -
- Advertisement -

దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు 18 తరగతులు చదువుకొంటున్న పిల్లల్లో మూడింట ఒక వంతు మంది డబ్బు చెల్లించి ప్రైవేటు ట్యూషన్లు చెప్పించుకొంటున్నారని ఈ నివేదిక పేర్కొనడం మరింత ఆహ్లాదకరంగా వుంది. కింది వర్గాలకు చెందిన తలిదండ్రులు తమ పిల్లలను చదివించి తీరాలనుకొంటున్నారని, ఆడ పిల్లలను మధ్యలో చదువు మాన్పించి ఇంటి పనులకు పరిమితం చేసే పూర్వపు తిరోగమన భావజాలం నుంచి వారు బయటపడుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

విద్య వల్ల ఉద్యోగాలు లభించినా, లభించకపోయినా పిల్లలు వివేకవంతులవుతారనే స్పృహ వారిలో పెరిగిందనుకోవాలి. అలాగే సంసార జీవనంలోనైనా మహిళ తనను తాను రక్షించుకొని ఉన్నతీకరించుకోడానికి చదువు తప్పనిసరి అవసరమని పేద వర్గాలు గుర్తిస్తున్నాయని కూడా భావించాలి. 2006 నుంచి 2014 వరకు, ఆ తర్వాత 2018 వరకు ప్రభుత్వ పాఠశాప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!లల్లో చేరిన 614 వయసు పిల్లలు 64.9% మందే కాగా, ఇది 2018లో 65.6 శాతానికి, 2022లో 72.5 శాతానికి చేరుకొన్నదని ఈ నివేదిక తెలియజేసింది. ప్రైవేటు బడుల్లో ఫీజుల కిమ్మత్తు భారీగా పెరిగిపోడం, కఠినమైన కొవిడ్ లాక్‌డౌన్ల కారణంగా ఉద్యోగాలు, ఉపాధులు దెబ్బతిని మధ్యతరగతి, కార్మిక వర్గ కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోవడం ఇందుకు కారణమని బోధపడుతున్నది.

ప్రైవేటు పాఠశాలల ఫీజులు భరించలేక చాలా మంది ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్ళుతున్నారు. మధ్యలోనే చదువు మానుకొంటున్న ఆడ పిల్లలు 2018లో 4.1% కాగా, 2022 నాటికి ఇది 2 శాతానికి తగ్గడం సంతోషదాయకం. 2006లో ఇది 10.3 శాతంగా వుండేది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో మాత్రం ఆడ పిల్లల డ్రాపౌట్ ఇంకా 10% వద్దనే వుండడం అక్కడి బలహీన వర్గాల నిరుపేదరికాన్ని, చైతన్యం లేమిని చాటుతున్నది. వీటి సరసన బీహార్ లేకపోడం గమనార్హం. కొవిడ్ కాలంలో పాఠశాలలు తరచూ మూతపడ్డాయి. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక 2018లో గల 97.2 % నుంచి 2022 నాటికి 98.4 శాతానికి చేరుకొన్నది.

వార్షిక విద్యా స్థాయి నివేదిక 2018 నుంచి నాలుగేళ్ళ పాటు కనుమరుగై 2022లో తిరిగి ముఖం చూపించింది. ఏడాదికి రూ. 1.4 లక్షలకు మించని ఆదాయం గల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో పాతిక శాతం సీట్లను కేటాయించాలని విద్యా హక్కు చట్టంలో వుంది. కాని అది గట్టిగా వాస్తవ రూపం ధరించిన దాఖలాలు కనిపించవు. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల నమోదు పెరిగినప్పటికీ వారి పఠన స్థాయిలు మెరుగుపడలేదని అర్థమవుతున్నది. రెండంకెల తీసివేత సరిగా చేయగల 3వ తరగతి పిల్లల సంఖ్య జాతీయ స్థాయిలో 28.2% నుంచి 25.9 శాతానికి తగ్గిపోయిందని తాజా నివేదిక తెలియజేసింది. తక్కువ అంకెల భాగహారం చేయగల 5వ తరగతి పిల్లల శాతం 28 నుంచి 25.6 శాతానికి పడిపోడం మరొక ఆందోళనకరమైన అంశం.

పాఠ్యగ్రంథాలను ఎంతగా మెరుగుపరిచినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు వాటి స్థాయిని అందుకోలేకపోడం అంతటా కనిపిస్తున్నది. బడి పిల్లల చదువుల్లో చెప్పుకోదగిన ప్రగతి కనిపించకపోడం సర్వసాధారణమైపోయింది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ పాలనలో పాఠ్యప్రణాళికలను కాషాయీకరించే దుర్మార్గం కూడా మొదలైంది. బిజెపి పాలనలోని కర్నాటకలో ప్రభుత్వం పాఠ్యాంశాల కాషాయీకరణను చేపట్టింది. ఆదర్శ పురుషుడు ఎవరు అనే అధ్యాయంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు హెడ్గేవార్ ఉపన్యాసాన్ని చేర్చడం కర్నాటకలోని మేధావుల నిరసనను చవిచూసింది. అటువంటి చేర్పులను పాఠ్యగ్రంథాల నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకొన్నది.

మహాత్మ బసవేశ్వర్, భగత్ సింగ్, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వంటి గొప్పవారి అభిప్రాయాలను తొలగించి పాఠ్యగ్రంథాల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని చేర్చడం పట్ల కర్నాటకలో ఎదురైన నిరసనను ప్రశంసించాలి. కాని బిజెపి పాలకుల ఈ ధోరణి నిరవధికంగా కొనసాగితే దేశంలో విద్య తిరోగమన మార్గంలో అతి వేగంగా పయనిస్తుంది. అతి మితవాదాల్లో ఎటో ఒక వైపు ఒరిగిపోకుండా అన్ని అంశాల పట్ల విద్యార్థులకు పరిపూర్ణమైన విజ్ఞానం కలిగించే విద్య దేశానికి అవసరం. పిల్లల నమోదు పెరగడంతోపాటు వారు నాణ్యమైన విద్యను లోపరహితంగా నేర్చుకొనే వాతావరణం దేశంలో ఏర్పడినప్పుడే మంచి చదువు అలవడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News