Friday, November 15, 2024

జిహెచ్‌ఎంసి కార్యాలయంలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్ల పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

Anointing of TRS Corporators in GHMC Office

బిజెపి దాదాగిరిని సహించబోం: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయాన్ని బిజెపి కార్పొరేటర్లు ధ్వంసం చేయాడాన్ని టిఆర్‌ఎస్ కార్పొటర్లు ముక్త కంఠంతో ఖండించారు. బిజెపి కార్పొరేటర్ల చర్యలు పూర్తిగా అప్రజాస్వామికమైనవిగా వారు అభివర్ణించారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత నేతృత్వంలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్లందరూ జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో బుధవారం శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి బోర్డుకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా మేయర్ చాంబర్‌నిపాలతో శుద్ది చేశారు. అనంతరం వారు కొద్దిసేపు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ బిజెపి కార్పొరేటర్ల దాదాగిరి సహించే ప్రసేక్తే లేదన్నారు. మేయర్ చాంబర్‌లో విధ్వంసానికి పాల్పడిన బిజెపి కార్పొరేటర్లను బర్తరఫ్ చేయాలని కోరుతూ మేయర్‌కు వినతిపత్రం సమర్పించామని ఆమె తెలిపారు. జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం నిర్వహణకు సంబంధించి గతంలో కరోనా కారణంగా వర్చువల్ విధానంలో నిర్వహించగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేని పరిస్థితి అన్నారు.

ఇది అంతా తెలిసి కూడా బిజెపి కార్పొరేటర్లు రాజకీయ లబ్ది కోసం పాకులాడడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులే ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం వారి అరాచకాన్ని నిదర్శనమన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన మహిళా మేయర్‌గా ఉండడం బిజెపి కార్పొరేటర్లు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, చింతల విజయ శాంతి, రషీదాబేగం, వి.జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, వి.పూజిత, పి.శిరీష, బండారి రాజ్ కుమార్, వనం సంగీత యాదవ్, మన్నే కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News