Thursday, January 23, 2025

ఒడిశా తరహాలో హైదరాబాద్-ఢిల్లీ రూట్లో మరో ప్రమాదం: రైల్వేకు బెదిరింపు లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒడిశాలో గత నెలలో సంభవించిన రైలు దుర్ఘటన తరహాలో మరో దుర్ఘటన హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో జరుగుతుందని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సిఆర్)కి ఒక అజ్ఞాత వ్యక్తి లేఖ రాశారు. ఎస్‌సిఆర్ డివిజనల్ మేనేజర్‌కు గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖ గురించి లైల్వే అధికారులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందచేశారు. మూడు రోజుల క్రితం తమకు ఈ సమాచారం అందిందని, లేఖ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసు డిప్యుటీ కమిషనర్ చందనా దీప్తి సోమవారం తెలిపారు.

ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జూన్ 2న రైలు దుర్ఘటనలో 290 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి తప్పుడు సిగ్నలింగే ప్రధాన కారణమని ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహించిన రైల్వే సేఫ్టీ కమిషనర్ తన ఉన్నత స్థాయి నివేదికలో పేర్కొంది. ప్రమాదం వెనుక ఎటువంటి కుట్ర కోణం కాని, విద్రోహ చర్య కాని లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రమాదంలో నేరమయ కోణాన్ని వెలికితీసేందుకు సిబిఐ కూడా దర్యాప్తు ప్రారంభించింది.

ఇదిలా ఉండగా, ఎస్‌సిఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సోమవారం అన్ని శాఖాధిపతులతో భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు(డిఆర్‌ఎం) అందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైళ్ల నిర్వహణలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ఈ సమావేశంలో చర్చించారు. సిబ్బందిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News