- Advertisement -
ఒకే రాష్ట్రం-ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుండటంపై పోలీస్ శాఖ చర్యలు చేప్టటింది. ఇప్పటికే 39 మందిని కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ రోడ్డెక్కి నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో తాజాగా మరో 10 మంది పోలీసులపై వేటు పడింది. బెటాలియన్స్‌లో అశాంతికి కారణమైన 10మందిని విధుల నుంచి తొలగిస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -