మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 1,56,810 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 92,906 మంది మొదటి డోసు తీసుకోగా, 63,904 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,01,433 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,13,389 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,12,269 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,52,199 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47,91,661 మంది మొదటి, 2,23,601మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 52,20,041 మంది మొదటి, 15,30,732 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,06,25,404 మంది తొలి, 21,11,9,921 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే వైరస్ నియంత్రణ సులువుగా మారుతుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.