Wednesday, January 22, 2025

సూడాన్ నుంచి స్వదేశానికి మరో 186 మంది భారతీయులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ కావేరీ కొనసాగుతోంది. తాజాగా జెడ్డా నుంచి 186 మందితో వాయుసేన విమానం కేరళ లోని కొచ్చికి చేరుకున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చీ సోమవారం ట్వీట్ చేశారు.

ఆదివారం 229 మంది బెంగళూరుకు చేరుకోగా, అంతకు ముందు రోజు శనివారం 365 మంది ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం 754 మంది రెండు బ్యాచ్‌ల వారీగా భారత్ చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు సూడాన్ నుంచి స్వదేశానికి మొత్తం 2700 మంది సురక్షితంగా చేరుకోగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News