హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 2,19,837 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 1,89,403 మంది మొదటి డోసు తీసుకోగా, 30,434 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,00,039 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,09,252 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,09,821 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,35,184 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో పాటు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 37,90,510 మంది మొదటి, 42,594 మంది రెండో డోసు తీసుకున్నారు.
ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 49,26,779 మంది మొదటి, 11,57,978 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 93,27,149 మంది తొలి, 15,45,008 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. ఇక కొవిన్‌లో నమోదైన 96,21,420 డోసుల్లో 62,970 ఆర్మీకి కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో 35,48,152 డోసులు వినియోగించగా, వ్యాక్సిన్ వేస్టేజ్ 0.11శాతం తేలింది. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణ కేవలం వ్యాక్సిన్‌తోనే సాధ్యమని ఆరోగ్యశాఖ మరోసారి ప్రకటించింది.