Thursday, January 23, 2025

ఆపరేషన్ కావేరీ.. సూడాన్ నుంచి స్వదేశానికి వచ్చిన మరో 229 మంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సూడాన్‌లో చిక్కుకుపోయిన మరో 229 మంది భారతీయులను ఆపరేషన్ కావేరీ మిషన్ కింద ఆదివారం వెనక్కు తీసుకు వచ్చారు. 365 మందిని ఢిల్లీకి తీసుకు వచ్చిన తరువాత తాజాగా 229 మందిని బెంగళూరుకు తీసుకు వచ్చారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సూడాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చిన వారి సంఖ్య 1954కు చేరుకుంది. ఘర్షణలు జరుగుతున్న ఖార్తోమ్ తదితర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా సూడాన్ పోర్టుకు చేర్చిన తరువాత అక్కడ నుంచి జెడ్డాకు విమానం, నౌకల ద్వారా తీసుకు వస్తున్నారు. జెడ్డా నుంచి భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి చేరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News