- Advertisement -
సుక్మా : చత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా పోలీసులు పూనా నర్కోమ్ (గోండు భాషలో కొత్తడాన్ అని అర్థం) క్యాంపయిన్ బాగానే పనిచేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి ఈ క్యాంపయిన్‌లో పోలీసులు తెలియచేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగి పోగా, తాజాగా ఈ జిల్లాలో బుధవారం మరో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారని జిల్లా పోలీసులు తెలిపారు. వీరిలో తొమ్మిది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో రూ. లక్ష అవార్డు తలపై ఉన్న పొడియామి లక్ష్మణ్ కూడా ఉన్నాడని జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ చెప్పారు. వీరితో కలిపి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య 176 కు చేరిందని తెలిపారు.
- Advertisement -