Friday, January 10, 2025

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. సిఎం కెసిఆర్ కు పూర్ణకుంభం తో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో జెఎన్ టియుహెచ్ చేరుకున్న సీఎం అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. కెసిఆర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇక ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించగా.. తాజాగా మరో 500 కోట్లను కేటాయిస్తూ సిఎం ప్రకటన చేశారు.

దీనితో మొత్తం రూ.600 కోట్లు ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇక యాదాద్రి ఆలయ అభివృద్ధి తరహాలోనే అంజన్న దేవాలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. దాదాపు 25 ఏళ్ల తరువాత కేసీఆర్ కొండగట్టుకు వచ్చారు. 1998లో కేసీఆర్ ఆలయానికి వెళ్లగా..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News