Wednesday, January 22, 2025

అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్, యుఎస్ బి, టైప్-సి, ఇన్ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.

ఫీచర్స్

ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 360హెచ్ జెడ్ టచ్ శాంపుల్ రేట్ తో 6.8-అంగుళాల ఫుల్-ఎచ్ డి+ కర్వ్డ్ 3డి అమోల్డ్ డిస్‌ప్లేతో లభించనుంది. స్క్రీన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందించనుంది. అంతేకాకుండా దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జి డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్ సిటి 920 6ఎన్ ఎం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో ఎస్ డి కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను ఎక్స్‌ప్యాండ్‌ చేసుకోవచ్చు. ర్యామ్ ను 13జిబి వరకు పెంచుకోవచ్చు. ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జి ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ XOSపై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 200 ఎంపి ప్రైమరీ సెన్సార్‌, 13 ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్, 2 ఎంపి టెరిటైరీ లెన్స్‌ ఉంటాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 ఎంపి కెమెరాను అమర్చారు.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 180 వాట్స్‌ థండర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. కనెక్టివిటీ కోసం హ్యాండ్‌సెట్‌ 5జి, యుఎస్ బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ వి5, వైఫై 6 వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. యూజర్ల సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ వంటి ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.

ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్‌లో 8జిబి ర్యామ్+ 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కెప్యాసిటితో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.29,999కు సొంతం చేసుకోవచ్చు. కాస్టైట్ సిల్వర్, జెనెసిస్ నోయిర్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. డిసెంబర్ 25 నుంచి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News