Sunday, September 8, 2024

అసెంబ్లీ నాటికి కాంగ్రెస్‌లోకి మరో 8మంది!

- Advertisement -
- Advertisement -

కారును వీడేందుకు సిద్ధపడుతున్న మరికొంతమంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు 
చేరేందుకు అవకాశాలు ఉన్న వారితో కాంగ్రెస్ నేతల మంతనాలు
పలుచోట్ల స్థానిక నేతల అభ్యంతరాలతో కొంత ఆలస్యం
అసంతృప్తులకు భరోసా ఇస్తున్న నాయకత్వం

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభమయ్యే నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు కారు దిగి, కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే చేరికతో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎల సంఖ్య పదికి చేరింది.ఏఐసిసి చేరికలకు అనుమతిచ్చిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆచితూచి అడుగులేస్తోంది.

నేపథ్యంలోనే కారు దిగేందుకు 8 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉండగా వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు టిపిసిసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, మేడ్చల్ మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేకానంద, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

స్థానిక కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు
కాంగ్రెస్‌లో చేరడానికి నగరానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పిసిసి వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన వారు సైతం పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎమ్మెల్యేల చేరిక పట్ల పలుచోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కొంత ఆలస్యం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా చూస్తామని టిపిసిసి వారికి హామీ ఇస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే బిఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, మరో 16 మం ది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చినట్టైతే బిఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News