Monday, January 20, 2025

లగచర్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో 8మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: లగచర్ల దాడి ఘటన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న మరో 8 మంది లగచర్ల గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించిన విచారిస్తున్నారు.
అనంతరం 8 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

మరోవైపు, లగచర్ల ఘటనపై డీజీ మహేశ్‌ భగవత్‌ వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసిన ఆయన.. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, ఈ దాడి ఘటన అనంతరం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News