Friday, November 22, 2024

క్యూ నెట్ కేసులో మరో నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః క్యూ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన ఉపేంద్రనాథ రెడ్డి అలియాస్ విసి ఉపేంద్రనాథరెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. క్యూ నెట్‌లో పనిచేస్తున్న నిందితుడు హైదరాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వి ఎంపైర్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. దీనిపేరు చెప్పి నిరుద్యోగుల నుంచి భరారీగా డబ్బులు వసూలు చేశాడు. రాజేష్ ఖన్నా, విసి ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇద్దరు కలిసి సికింద్రాబాద్‌లోని పలు హోటళ్లలో నిరుద్యోగులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవారు ఇందులో చేరితే సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20,000 నుంచి రూ.50,000 వసూలు చేశారు.

ఇలా వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. 163మంది బాధితుల నుంచి నిందితులు 54 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇది పిరమిడ్ స్కీం కావడంతో తెలియక చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడంతో క్యూనెట్ భాగోతం బయటపడింది. అందులో పనిచేస్తున్న యువతులు అగ్నిప్రమాదంలో మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు 15మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. వారిలో తొమ్మింది మందిని అదుపులోకి తీసుకోగా మిగతా వారు పరారీలో ఉన్నారు. ఎస్సై రవికుమార్, హెచ్‌సి ఎస్‌వి రామకృష్ణ, పిసి ఉపేందర్ కుమార్ తదితరులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News