Sunday, January 5, 2025

వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న మరో నటి వారసురాలు!

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ నటించిన ‘రుస్తుం’ మూవీ గుర్తుందా? అందులో చిరంజీవితో పోటాపోటీగా స్టెప్పులేస్తూ, ఆయనకు దీటుగా నటించి అందరి మెప్పూ పొందిన హీరోయిన్ ఊర్వశి. తమిళంలో ‘మూందానై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి, తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, తమిళంలో పెద్ద హీరోలందరి పక్కనా నటించింది. కమల్ హాసన్ తో మైకేల్ మదన కామరాజులో నటించి నవ్వుల పువ్వులు పూయించిందామె. హీరోయిన్ గా ఛాన్సులు తగ్గాక కేరక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. ఊర్వశి 2000లో మలయాళ నటుడు మనోజ్ జయన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి తేజ లక్ష్మి అనే కూతురు పుట్టింది. అయితే ఈ జంట 2008లో విడిపోయింది. ఆ తర్వాత ఊర్వశి చెన్నైకు చెందిన శివప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుంది. వీరికి ఓ కొడుకున్నాడు.

తాజాగా ఊర్వశి తన కూతురు తేజ లక్ష్మిని వెండితెరకు పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. 23 ఏళ్ళ లక్ష్మి అందంలో తల్లితో పోటీ పడుతోంది. చక్కటి ఒడ్డూ పొడుగూ ఉన్న ఈమెకు హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయనే చెప్పవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News