Monday, December 23, 2024

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరొకరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు ఫార్మ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) సిబ్బంది మరొకరిని పట్టుకున్నారు. దీనితో ఇంత వరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు అయింది. హైదరాబాద్‌కు చెందిన ఆరవ నిందితుడు రేవ్ పార్టీ నిర్వాహకుల్లో ఒకరని పోలీస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ నెల 19న తెలుగు సినీ నటితో సహా 103 మంది హాజరైన పార్టీపై సిసిబి దాడి జరిపింది. ఫార్మ్ హౌస్‌లోని రేవ్ పార్టీకి హాజరైనవారి రక్తం నమూనాలను పరీక్షించినప్పుడు మాదకద్రవ్యాలకు సంబంధించి పాజిటివ్ ఫలితం వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News