Thursday, January 23, 2025

డేటా చోరీ కేసులో మరొకరి అరెస్ట్.. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్ నుంచి డేటా చోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డేటా చోరీ కేసులో మరొక నిందితుడిని సైబరాబాద్ పోలీసులు హరియాణాలోని ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజను శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 సెల్ ఫోన్లు,2 లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది వివరాలను గుర్తించారు. నిందితుడు విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగుల డేటాను అమ్మినట్లు సమాచారం. ‘ఇన్ స్పైర్ వెబ్’ అనే వెబ్ సైట్ ద్వారా పౌరుల డేటాను విక్రయించాడు. అవసరమైన వారికి ప్రజల వ్యక్తిగత డేటా అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్ స్టాగ్రామ్, బుక్ మై షో, బైజూస్, అప్ స్టాక్స్ వంటి సంస్థల నుంచి డేటాను భరద్వాజ వివారాలు సేకరించినట్లు సైబరాబాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News