Saturday, December 21, 2024

మహేశ్ బ్యాంక్ కేసులో పురోగతి…

- Advertisement -
- Advertisement -

Another arrested in Mahesh Bank hacking case

హైదరాబాద్: మహేశ్ బ్యాంక్ కేసులో పురోగతి లభించింది. బ్యాంకు హ్యాకింగ్ కేసులో మరో కీలక వ్యక్తిని అరెస్టు చేశామని హైదరాబాద్ సిపి ఆనంద్ పేర్కొన్నారు. మహేశ్ బ్యాంకు కేసులో పురోగతిని బుధవారం మీడియా సమావేశంలో వివరించారు. ప్రధాన నిందితుడికి సహకరించిన ఇక్పాస్టీఫెన్ ఓర్జి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు సిపి ఆనంద్ పేర్కొన్నారు. నైజీరియాలో ప్రధాన నిందితుడికి స్టీఫెన్ ఓర్జి కీలక సమాచారం ఇచ్చినట్టు గుర్తించామన్నారు. స్టీఫెన్ ఓర్జి సమాచారంతో ప్రధాన నిందితుడు బ్యాంకును హ్యాక్ చేశాడని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. మహేశ్ బ్యాంకు ఖాతాల నిందితులు రూ. 9 కోట్లు కొల్లగొట్టారని ఆయన తెలిపారు. పట్టుదలతో ఈ కేసును ఛేధించామని సిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News