Saturday, January 18, 2025

కర్నాటకలో మరో బ్యాంక్ దోపిడీ

- Advertisement -
- Advertisement -

మంగళూరు : పట్టపగలు.. ఐదు, ఆరుగురు ముసుగు దొంగలు కోటేకర్ బ్యాంక్‌లో ప్రవేశించారు. వారి చేతిలోఫిస్టల్, తల్వార్, కత్తులు ఇతర ఆ యుధాలు.. అంతా 25-35 ఏళ్లలోపువారే. వారిని చూసి, ఆసమయంలో బ్యాంక్‌లో పనిచేస్తున్న నాలుగు ఐదుగురు షాక్ తిన్నారు. వారు షాక్ నుంచి తేరుకునే లోగానే.. రూ 10 నుంచి 12 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలు..దోచుకు పోయారు. అంతా అరగంట వ్యవధిలో ముగిసిపోయింది ఉల్లాల్ తాలూకా కోటేకర్ లోని కేఆర్ రోడ్ లో ఉన్న కోటేకర్ వ్యవసాయ సహకార సేవా సంఘ్ బ్యాంక్ బ్రాంచి లో ఉదయం 11.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.30 మధ్య ఈ దోపిడీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ వివరాలను పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వా ల్ వివరించారు.

దొంగలు హిందీలో మాట్లాడుతూ.. సిబ్బందిని కత్తుల తో బెదిరించి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ ను , లాకర్లను బలవంతంగా తెరిపిం చి, నగలు, నగదుతో వెండి సామగ్రితో సహా దాదాపు 10- నుంచి 12 కో ట్ల రూపాయల విలువైన వస్తువులనూ దోచుకుపోయారు. దోచుకున్న నగ లు, నగదు మూటకట్టుకుని నల్లటి ఫియెట్ కారులో పరారయ్యారు. వెం టనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి దొంగలకోసం గాలింపు చేపట్టారు. ఈ వార్త అందిన వెంటనే ముఖ్యమంత్రి సి ద్దరామయ్య మంగళూరులో పోలీసు ఉన్నతాధికార సమావేశం ఏర్పాటు చేసి , దొంగలను పట్టుకుని మొత్తం నగలు, నగదూ రికవరీ చేయాలని ఆ దేశించారు. గురువారం బీదర్‌లో దోపిడీ దొంగలు ఎటిఎం వాహనంపై దాడి చేసి నగదు అపహరించిన సంఘటనను మరువకముందే మరో బ్యాంక్ లో దోపిడీ జరగడం అధికారవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News