Monday, December 23, 2024

ఉద్ధవ్ థాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నికల సంఘం ‘శివసేన’ పేరు, పార్టీ చిహ్నాలను ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. కాగా తాజాగా ఉద్ధవ్ థాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్‌లో ఉన్న శివసేన కార్యాలయాన్ని తాజాగా ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించారు. లోక్‌సభ సెక్రటరియేట్ రూమ్ నెం. 128ని ఇప్పుడు షిండే వర్గానికి కేటాయించింది. ఇదివరకు ఇది శివసేన పార్టీకి ఉండింది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సచివాలయం లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే వర్గం నేత రాహుల్ షెవాలేకు లేఖ రాసింది. అంతేకాకుండా, ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అధికారిక శివసేనగా గుర్తిస్తూ భారత ఎన్నికల సంఘం(ఈసిఐ) నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాక్రే వేసిన పిటిషన్‌ను బుధవారం విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 17న శివసేన పార్టీ పేరు, విల్లుబాణం గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News