Friday, November 15, 2024

పోలింగ్ వేళ పాక్‌లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీస్‌లు గాలిస్తున్నారు.

బలూచిస్థాన్ లోనూ గురువారం మరోసారి బాంబు పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. బలూచిస్థాన్‌లో బుధవారం పేలుళ్లకు 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో గురువారం ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటైంది. మొత్తం 90 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అయినా తాజా పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News