Saturday, July 6, 2024

బీహార్‌లో కూలిన మరో వంతెన

- Advertisement -
- Advertisement -

15 రోజుల్లో ఏడవది
శివన్ జిల్లాలో 11 రోజుల్లో రెండోది

శివన్ (బీహార్) : బీహార్‌లో వంతెనలు కూలిపోతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం శివన్ జిల్లాలో గండకీ నదిపై ఒక వంతెనలో కొంత భాగం కూలిపోయింది. రాష్ట్రంలో గడచిన 15 రోజుల్లో కూలిన ఏడవ వంతెన ఇది. శివన్ జిల్లా దేవ్‌రియా బ్లాక్‌లో గల చిన్న వంతెన మహారాజ్‌గంజ్ జిల్లాలో పలు గ్రామాలను అనుసంధానిస్తుంది. ఈ ఘటనలో ఇంత వరకు ప్రాణ నష్టం గురించిన సమాచారం లేదు. కాగా, గడచిన 11 రోజుల్లో శివన్ జిల్లాలో ఈ విధంగా కూలిన వంతెన ఇది రెండవది. వంతెన కూలిపోవడానికి అసలు కారణంపై దర్యాప్తు జరుగుతోందని డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ తెలియజేశారు.

బ్లాక్ నుంచి సీనియర్ అధికారులు ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ‘ఈ సంఘటన తెల్లవారు జామున సుమారు 5 గంటలకు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ వంతెనను 1982-83లో నిర్మించారు. కొన్ని రోజులుగా మరమ్మతు పనులు సాగుతున్నాయి’ అని కుమార్ వివరించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వంతెన కూలిపోవడానికి కారణమై ఉండవచ్చునని, గండకీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం వల్ల వంతెన స్తంభాలు బలహీనపది ఉండవచ్చునని గ్రామస్థులు అభిప్రాయం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News