Friday, December 27, 2024

గుజరాత్‌లో కూలిపోయిన మరో వంతెన

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్‌లోని తపీ జిల్లాలో మిండోలా నదిపై కొత్తగా నిర్మించిన మరో వంతెన బుధవారం కూలిపోయింది. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ంతెన ఇంకా ప్రారంభానికి నోచుకోకముందే కూలిపోవడంతో ముగ్గురు ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

తపీ జిల్లా వలోద్ తాలూకాలోని మాయాపూర్ గ్రామాన్ని, వ్యారా తాలూకాలోని దెగామా గ్రామాన్ని అనుసంధానించే ఈ వంతెనకు చెందిన కొంత భాగం బుధవారం ఉదయం కూలిపోయింది. దీంతో బిజెపి ప్రభుత్వ అవినీతి కారణంగానే ఈ వంతెన కూలిపోయినట్లు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈహైలెవల్ వంతెనకు ఉపయోగించిన నిర్మాణ సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్లు తెలిసింది. నిర్మాణానికి బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

ఇలా ఉండగా&అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, మెహసానా తదితర జిల్లాలలో వంతెన కూలిపోయిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి ఒక ప్రకటనలో తెలిపారు. తాజా సంఘటన కనీసం 15 గ్రామాలను ప్రభావితం చేస్తోందని చెప్పారు. బిజెపి ప్రభుత్వ అవినీతి మోడల్‌పై ప్రజలు విసుగెత్తిపోయారని ఆయన తెలిపారు. గత ఏఆడాది మోర్బీ వంతెన కూలిపోయి 132 మంది ప్రజలు మరనించిన దుర్ఘటనను ఆయన గుర్తు చేశారు. అవినీతిపరులైన అధికారులు, బిజెపి కాంట్రాక్టర్లు కుమ్మక్కవ్వడంతోనే ఈ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. 2021లో అహ్మద్‌ఆబాద్‌లో కొత్తగా నిర్మించిన ముమత్‌పురా ఫ్లైఓవర్ కూడా కూలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News