Sunday, September 8, 2024

బీహార్‌లో కూలిపోయిన మరో వంతెన

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. గడచిన మూడు వారాల కాలంలో వంతెన కూలిపోవడం ఇది 13వ ఘటన. బుధవారం తెల్లవారుజామున సహర్సా జిల్లాలోని మహిషి గ్రామం వద్ద వంతెన కూలిపోయినట్లు అధికారి ఒకరు తెలిపారు. అది చిన్న వంతెనో లేక కాజ్‌వేనో కావచ్చని, ఘటనా స్థలానికి అధికారులు తరలి వెళ్లారని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నామని అదనపు కలెక్టర్(సహర్సా) జ్యోతి కుమార్ తెలిపారు.

అయితే ఈ ఘటనలో ఎవరైనా మరణించిందీ లేక గాయపడిందీ వంటి వివరాలు తెలియరాలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని సివాన్, శరణ్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్‌తోసహా వివిధ జిల్లాలలో వంతెనలు కూలిపోయిన ఘటనలకు సంబంధించి 15 మంది ఇంజనీర్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రంలోని పాత వెంతెనలను సర్వే చేసి చి వాటికి అవసరమైన మరమ్మతులను గుర్తించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఇటీవల ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News