- Advertisement -
శివ్వంపేట: సంగారెడ్డి జిల్లా శివ్వంపేట మండలంలోని గంగయ్య పల్లి గ్రామంలో శనివారం ఉదయం సదానందం రైతు గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువులపాకపై కుక్కలు దాడిచేయగా 3 గేదె దూడలపై దాడి చేసి 2 చనిపోగా మరో దూడకు తీవ్ర గాయాలయ్యాయి. రైతు ఉదయాన్నే వెళ్లి పాలు పిండి ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వాటికి మేత వేయడానికి వెళ్లాడు ఒక్కసారిగా 20 కుక్కలు గేదెలపై దాడి చేస్తుంటే కుక్కలను కొట్టడంతో అక్కడినుంచి వెళ్లిపోయాయి చూసేసరికి రెండు గేదలు చనిపోయాయి. మరొక దానికి గాయాలయ్యాయి. గేదె దూడలు లక్షల రూపాయలు పెట్టి ఉపాధి కోసం తెచ్చుకున్న గేదెలులేనివి పాలు ఇవ్వవని రైతు సదానందం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
- Advertisement -