Sunday, December 22, 2024

బిజెపి ఎంఎల్‌ఏ రాజాసింగ్‌పై మరో కేసు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి ఎంఎల్‌ఏ రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీస్ కేసు నమోదైంది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ గోషామహల్ ఎంఎల్‌ఎపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మాజీ సిఎం నారాయణ రాణే తనయుడు, ఎంఎల్‌ఏ నితీష్ రాణేపై కూడా పోలీస్ కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గత శనివారం షోలాపూర్‌లోని రాజేంద్ర చౌక్ నుండి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు.

ఇందులో బిజెపి ఎంఎల్‌ఏలు నితీష్ రాణే, రాజాసింగ్‌తో పాటు సకల హిందూ సమాజ్ నేతలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా బిజెపి ఎంఎల్‌ఎలు విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా ఆరోపణలు రావడం, ఫిర్యాదులు అందడంలో జైల్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఐపిసి 153ఎ, 295ఎ సెక్షన్ల కింద ఎంఎల్‌ఏలు రాజాసింగ్, నితీష్ రాణేతో సకల హిందూ సమాజ్ నాయకులపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజాసింగ్ ‘లవ్ జిహాద్’ గురించి అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. మరో ఎంఎల్‌ఏ నితీష్ రాణే జిహాదీలు, ముస్లింల ప్రార్థనా మందిరాలైన మసీదుల కూల్చివేతపై మాట్లాడారు. ఇలా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ ఇద్దరు ఎంఎల్‌ఏల ప్రసంగం వుండటంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు షోలాపూర్ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News