Monday, December 23, 2024

బాబుపై మరో కేసు

- Advertisement -
- Advertisement -

లిక్కర్ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సిఐడి కేసు
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్

మన తెలంగాణ/హైదరాబాద్ : చంద్రబాబుపై ఎపి సిఐడి విభాగం మరో కేసు పెట్టింది. ఇప్పటికే వివిధ రకాల కేసులు నమోదు చేసిన సిఐడి అధికారులు తాజాగా మధ్యం విషయంలో మరో కేసు పెట్టారు. టిడిపి హాయాంలో లిక్కర్ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది. దీనిపైనే పిసి (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చట్టం కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశా రు. ఈ కేసులో చంద్రబాబును ఏ-3గా చేర్చారు. ఈ కేసు చంద్రబాబుపై నమోదు చేసిన విషయా న్ని ఎసిబి కోర్టుకు సిఐడి అధికారులు తెలిపారు. ఎసిబి కోర్టులో కేసుకు సంబంధించి విచారణ చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో బాబు ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం అనుమతుల కేసులో ఎసిబి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సిఐడి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్…
టిడిపి అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఎపి హైకోర్టు రిజర్వ్ చేసింది. మంగళవారం ఎపి హైకోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించాలని కోరారు. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారన్నారు. చంద్రబాబు 50 రోజులుగా జైలులో రిమాండ్‌లో ఉన్న అంశాన్ని న్యాయవాదులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News