- Advertisement -
నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అభ్యకర వ్యాఖ్యలు, కులాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని యాదమర్రి, పుత్తూరు పోలీసుస్టేషన్‌ల్లోనూ ఆయనపై ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు. కాగా అన్నమయ్య జిల్లాల సంబేపల్లిలో నమోదైన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజంపేట సబ్ జైలులో ఉన్న ఆయనను పిటి వారెంట్‌పై తీసుకొచ్చి నరసనరావు పేటలో నమోదు అయిన కేసుకు సంబంధించిన కోర్టులో ప్రవేశపెట్టారు. మరో వైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున కడప మొబైల్ కోర్టులో వాదనలు వినిపించారు. కస్టడీకి ఇవ్వాలని అటు పోలీసులు కోరారు. దీంతో రెండు పిటిషన్లపై విచారణను 5కు వాయిదా వేసింది.
- Advertisement -