- Advertisement -
రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదయింది. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై మార్ఫింగ్ ఫొటోలకు సంబంధించే ఈ కేసు కూడా నమోదయింది. గురువారం విచారణకు హాజరు కావా లంటూ రావికమతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు వర్మ మరో వారం రోజులు సమయం కోరినట్టు తెలు స్తోంది. అంతకు మునుపు చంద్రబాబు,
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వారిని కించపరిచేలా కామెంట్లు చేసిన అంశంలోనే ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. నవంబర్ 20న ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు రావాలని నోటీ సులు ఇచ్చారు. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం కావాలని వర్మ కోరారు. దీంతో నవంబర్ 25న విచారణకు హాజరు కావాలని బుధవారం మరోసారి నోటీసులు ఇచ్చారు.
- Advertisement -