Saturday, November 23, 2024

సూకీపై మరో కేసు

- Advertisement -
- Advertisement -

Another case was registered against Aung San Suu Kyi

 

విచారణలేకుండా నిర్బంధించే వీలు

యాంగోన్: మయాన్మార్ నాయకురాలు ఆంగ్‌సాన్‌సూకీపై మరో కేసు నమోదైందని ఆమె న్యాయవాది ఖిన్‌మౌంగ్‌ఝా మంగళవారం వెల్లడించారు. తమ దేశ రాజ్యాంగంలోని అధికరణం 25, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుల్ని విచారణ లేకుండా ఎంతకాలమైనా నిర్బంధించే వీలున్నదని ఝా తెలిపారు. ఈ చట్టం కిందికి వచ్చే కరోనా నిబంధనలను సూకీ ఉల్లంఘించారంటూ సైనిక ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ చట్టం శిక్షా స్మృతిలో సైనిక ప్రభుత్వం మార్పులు చేసింది. దాని ప్రకారం కోర్టు అనుమతి లేకుండా నిందితుల్ని ఎంతకాలమైనా నిర్బంధించే వీలుంటుంది. ఫిబ్రవరి 1న ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి సూకీసహా పలువురు రాజకీయ నేతలు నిర్బంధంలో కొనసాగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News