హైదరాబాద్: పాతబస్తీలో మరో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఆదివారం వెలుగులోకి వచ్చింది. నగరంలో తరచూ కాంట్రాక్ట్ మ్యారేజ్‌లు బయటపడుతున్నాయి. యువతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్న బ్రోకర్లు గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు వ్యాపారులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఇక్కడి నుంచి యువతులను తీసుకుని వెళ్లిన తర్వాత అక్కడ వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా షేక్‌ల చేతిలో మోస పోయిన వారు తమను కాపాడాలని తరచూ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వేడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పాతబస్తీకి చెందిన యువతికి యెమన్ దేశానికి చెందిన సలీం అనే వ్యక్తి, ఇతడికి మానసిక స్థితి సరిగాలేదు. పాతబస్తీకి చెందిన బ్రోకర్లు డబ్బులకు ఆశపడి యువతిని ఇచ్చి వివాహం చేశారు. అక్కడికి తీసుకుని వెళ్లిన తర్వాత సలీం యువతిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. బాధితురాలు ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పాస్‌పోర్టు తీసుకుని తమ వద్ద పెట్టుకున్నారు. సలీంతోపాటు అతడి కుటుంబ సభ్యులు కూడా బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్నారు. తనను కాపాడాలని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిపింది. తమ కూతురిని ఇండియాకు రప్పించి కాపాడాలని బాధితురాలి తండ్రి విజ్ఞప్తి చేశాడు.
Another Contract Marriage in Old City Hyderabad