- Advertisement -
హైదరాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను వణికిస్తోంటే ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోథ్ మండలంలోని మర్లపెల్లి అటవీప్రాంతంలో మంగళవారం నాడు చిరుతపులి ఓ ఆవును హతమార్చటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పదిరోజుల వ్యవధిలో చిరుతపులి రెండు ఆవులను హతమార్చటం వల్ల స్థానికులకు భయం పెరిగిపోతోంది.పదిరోజుల కిందట కంటేగాం- మర్లపెల్లి సెక్టార్ పరిధిలో చిరుత ఓ ఆవును చంపింది. తాజాగా మర్లపెల్లి- పట్నాపూర్ బీట్ పరిధిలో గ్రామానికి చెందిన వెల్మల నారాయణకు చెందిన ఆవును హతమార్చడం వల్ల స్థానికుల్లో భయం తీవ్రతరమైంది. అటవీశాఖ అధికారులు స్పందించడంలేదనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తుంటే ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని అధికారులు పేర్కొంటుండటం విచారకరం.
- Advertisement -