Friday, December 27, 2024

బంగాళాఖాతంలో మరో వాయుగుండం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజులపాటు ఏపిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను వర్షాలు ముంచేత్తుతాయని హెచ్చరించారు. నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా పయనించి ఈ నెల 7నాటికి వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఇది తుపాన్‌గా మారుతుందని తెలిపారు. ఈ నెల 9రాత్రి లేదా 10 ఉదయానికి ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచాన వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News