Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులకు మరో డీఏ విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులకు మరో డీఏ విడుదల చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిసెంబర్ జీతం ఆర్టీసి చెల్లించడంతో వచ్చేనెల దీనిని ఇవ్వనున్నట్లు ఆర్టీసి తెలిపింది. దీంతో టిఎస్‌ఆర్టీసి మొత్తం 7 డిఏలకు గాను 6 డిఏలను ఇప్పటివరకు ఇచ్చినట్టయ్యింది.

ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరవు భత్యం (డీఏ) మంజూరు చేయాలని యాజమాన్యం ఇదివరకే నిర్ణయించిన నేపథ్యంలో ఈ డిఏను జనవరి నెల జీతంతో కలిపి ఫిబ్రవరి నెలలో చెల్లించాలని ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న మరో డిఏను మూడు, నాలుగు నెలల్లో చెల్లించే అవకాశం ఉన్నట్టుగా టిఎస్ ఆర్టీసి అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News