- Advertisement -
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆరోపణలు, ప్రత్యారోపణల రణగోణుల మధ్య రాజ్యసభ, లోక్‌సభ మరో రోజుకు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి సభ్యులు ఉభయ సభలలో నినాదాలు చేశారు. కాగా ప్రతిపక్ష ఎంపీలు అదానీ విషయంలో కేంద్రాన్ని లక్షం చేసుకుని వాగ్వాదానికి దిగారు.
బిజెపి సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా వద్దకు వెళ్ళి లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యానికి అవమానకరమని, వెంటనే ఈ విషయంపై విచారణ చేసేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని అన్నారు. సభలో రాహుల్ గాంధీ క్షమాపణలు కోరకుంటే లోక్‌సభను సస్పెండ్ చేయాల్సిందిగా కూడా వారు కోరారు. ఇదిలావుండగా రాహుల్ గాంధీ గురువారం స్పీకర్‌ను కలిసి సభలో తనను తాను డిఫెండ్ చేసుకునేలా మాట్లాడేందుకు అనుమతివ్వాలని కోరారు.
- Advertisement -