- Advertisement -
నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో ప్రమాదం జరిగి నెల రోజులు దాటింది. ప్రమాదంలో చిక్కకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సహాయక చర్యల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో టన్నెల్ బోర్ మిషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం ఇప్పటికే లభించింది. తాజాగా మరో మృతదేహాం ఆనవాళ్లు సహాయక బృందం గుర్తించినట్లు సమాచారం. తవ్వకాలు జరుపుతుండగా.. లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది. డి1, డి2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతుండగా.. ఈ పరిణామం చోటు చేసుకుందట. అయితే టన్నెల్‌లో మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు ఇంకా అధికారులు ధృవికరించలేదు.
- Advertisement -