Sunday, December 22, 2024

కారు కొట్టుకుపోయిన ఘటనలో మరో మృత దేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో మరో మృత దేహం లభించింది.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమగూడెం వద్ద ఆకేరు వాగు పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరుగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన సునావత్ అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ ఉన్నారు. వీరు హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

అశ్వినీ మృత దేహం ఆదివారం ఆకేరు వాగు దగ్గరలోని ఓ పామాయిల్ తోటలో దొరికింది. తండ్రి మోతీలాల్ మృత దేహం కోసం పోలీసులు గాలించడం మొదలెట్టారు. అయితే సోమవారం ఉదయం మోతీలాల్ మృత దేహం గ్రామ శివారులో లభించింది. మృత దేహాన్ని మృతుడి కుటుంబానికి పోలీసులు అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News