కరోనా వైరస్‌తో గత మూడేళ్లుగా సతమతమవుతుండగా ఆఫ్రికాలో ఇప్పుడు కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మార్‌బర్గ్ అనే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఎబోలా వైరస్ పోలిన లక్షణాలు దీనికి ఉంటాయి. జ్వరం, రక్తస్రావం, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. శరీర సామర్ధం తగ్గిపోతుంది. ఈక్వటోరియల్ గినియాలో కలకలం రేపుతుండడంతో గత ఫిబ్రవరిలో గినియాకు ప్రత్యేక వైద్య బృందాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ పంపి నివారణ చర్యలు తీసుకుంది.
Also Read: వృద్ధాప్య ప్రభావాలు తగ్గుదల
ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాటస్, కామెరూన్ సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ కేసులు వెలుగు చూశాయి. కీ ఎన్‌టైమ్ ప్రావిన్స్‌లో గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తొమ్మిది మంది మరణించారు. కేస్ మేనేజ్‌మెంట్, నియంత్రణ, ల్యాబొరేటరీ, రిస్క్ కమ్యూనికేషన్ నిపుణులను గినియాకు డబ్లుహెచ్‌ఒ పంపింది. నమూనా పరీక్షల కోసం ల్యాబొరేటరీ గ్లోవ్ టెంట్‌లు, వైరల్ హెమరేజిక్ ఫీవర్ కిట్‌లు, పీపీఈ కిట్‌లను సమకూర్చింది. ఈ వైరస్ మరణాల నిష్పత్తి 88 శాతం వరకు ఉంటున్నట్టు డబ్లుహెచ్‌ఒ అంచనా వేసింది. ఈవైరస్ బాధితులు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.
Also Read: హైపర్‌బేరిక్ థెరపీతో ఎన్నో ప్రయోజనాలు
చాలా మందికి ఏడు రోజుల్లో తీవ్రమైన రక్తస్రావం లక్షణాలు కనిపిస్తాయి. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారితో ప్రత్యక్షసంబంధం ఉన్నా, సన్నిహితంగా మెలిగినా, లేదా శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.ఇప్పటివరకు ఈ వైరస్‌ను అరికట్టే టీకాలు , లేదా చికిత్సలు అందుబాటు లోకి రాలేదు. అయినప్పటికీ ప్రాణాపాయం నుంచి కాపాడే అనేక చికిత్సలను ఉపయోగిస్తున్నారు. ఇమ్యూన్ థెరపీలు, ఔషధాలు, క్లినికల్ దశలో ఉన్న వ్యాక్సిన్లతో చికిత్సలు కొనసాగిస్తున్నారు.
Also Read: రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌కు మొట్టమొదటి వ్యాక్సిన్ “అరెక్స్‌వీ”