Monday, December 23, 2024

సన్‌రైజర్స్‌కు మరో ఓటమి

- Advertisement -
- Advertisement -

చెన్నై : సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ34( 26 బంతులు; 3×4, 1×6), రాహుల్ త్రిపాటి 21 (21 బంతలు; 1×4, 1×6)లు తప్ప మరెవరూ రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది.

చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3/22తో రాణించి సన్‌రైజర్స్ పరుగుల వరదకు చెక్ పెట్టాడు. అనంతరం 135 పరుగుల లక్ష ఛేదనకు దిగిన చెన్నై రుతురాజ్ గైక్వాడ్ 35(30 బంతులు; 2×4), దెవొన్ కాన్వోయ్ 77(57 బంతులు; 12×4, 1×6) చెలరేగడంతో మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News