Monday, January 20, 2025

సన్‌రైజర్స్‌కి ఢిల్లీ షాక్.. చేజేతులా ఓడిన హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది.

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ హారీ బ్రూక్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించి ఏడు పరుగులకే వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (5), కెప్టెన్ మార్‌క్రమ్ (3) విఫలమయ్యారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏడు ఫోర్లతో 49 పరుగులు చేశాడు. క్లాసెన్ (31), సుందర్ 24 (నాటౌట్) కాస్త రాణించినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్‌లో మనీష్ పాండే (34), అక్షర్ పటేల్ (34), మిఛెల్ మార్ష్ (25) మాత్రమే రాణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News