హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగు సాగక, సర్కారు భరోసా కానరాక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత పది రోజుల్లో ఖమ్మం జిల్లాలో ఇది నాలుగో సంఘటన కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథ్‌పల్లి మండలం రజాబ్ అలీ నగర్‌కు చెందిన ప్రసాద్ (32) అనే రైతు 15 ఏళ్లుగా పోడు భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
తనకు సంబంధించిన ఆరున్నర ఎకరాల భూమి విషయంలో ఓ కానిస్టేబుల్‌తో వివాదం నెలకొంది. సుమారు 15 ఏండ్లుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూమి లో కానిస్టేబుల్ తన కూతురు పేరుమీద అక్రమంగా పట్టా తీసుకున్నాడని ఆరోపిస్తూ రైతు ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నం
గత పది రోజుల్లో ఖమ్మం జిల్లాలో నాలుగవ ఘటన
తాను సాగు చేస్తున్న భూమి పైకి మరో వ్యక్తి వచ్చి ఆక్రమిస్తున్నట్టు రైతు ఆరోపణ.
రఘునాథ్ పల్లి మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన రైతు ప్రసాద్ (32) ఆత్మహత్యాయత్నం.
సుమారు ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించి… pic.twitter.com/c1Ja1NIAGy
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024