Wednesday, January 22, 2025

గుండెపోటుతో మరో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

తాజా ఆందోళనలో మూడవ మరణం

చండీగఢ్: పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరి పాయింట్ వద్ద రైతుల ఛలో ఢిల్లీ యాత్రలో భాగంగా ఆందోళన చేస్తున్న ఒక 62 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించినట్లు రైతు నాయకుడు ఒకరు శుక్రవారం తెలిపారు. పంజాబ్ బటిండా జిల్లాలోని అమర్‌గఢ్ గ్రామానికి చెందిన దర్శన్ సింగ్ అనే రైతు గుండెపోటుతో మరణించినట్లు రైతు నాయకుడు శర్వన్ సింగ్ పంధెర్ తెలిపారు.

తమ పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్‌పి)పై చట్టం కల్పించడంతోపాటు వివిధ డిమాండ్ల సాధన కోసం ఛలో ఢిల్లీ యాత్రను చేపట్టిన పంజాబ్ రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరి పాయింట్ల వద్ద తీవ్ర వీరి ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చ(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చ(కెఎంఎం) ఆధ్వర్యంలో స్థాయిలో నిరసన తెలియచేస్తున్నారు.ఇదే ఆందోళనలో భాగంగా ఇటీవల ఒక 72 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు. శంభూ సరిహద్దున మరో 63 ఏళ్ల రైతు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.

కాగా..బుధవారం ఖనౌరీ పాయింట్ వద్ద హర్యానా పోలీసులకు, పంజాబ్ రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో బటిండాకు చెందిన శుభ్‌కరణ్ అనే 21 ఏళ్ల యువ రైతు మరణించాడు. ఖనౌరీ వద్ద బారికేడ్లను ఛేదించుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన కొందరు రైతులతో పోలీసులు ఘర్షణ పడినపుడు ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. యువ రైతు మరణాన్ని పురస్కరించుకుని రెండు రోజులపాటు ఛలో ఢిల్లీ యాత్రకు విరామం ప్రకటించిన రైతు నాయకుడు తదుపరి కార్యాచరణను త్వరలోనే నిర్ణయించనున్నారు. శంభూ, ఖనౌరీ పాయింట్ల వద్ద వందలాది ట్రాక్టర్ ట్రాలీలతో రోడ్లను అడ్డగిస్తూ అక్కడే మకాం వేసి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News