Tuesday, January 14, 2025

యుపిలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

మీరట్: పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను గురువారం మధ్యాహ్నం ఇక్కడ ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోర్స్(ఎస్‌టిఎఫ్) ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. రాష్ట్రంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో దుజానా ఉన్నాడు. 2012 నుంచి జైలులో ఉన్న దుజానా 2021లో బెయిల్‌పై విడుదలయ్యాడు. హత్య, డుబ్బు కోసం బెదిరింపులుతో సహా మొత్తం 32 కేసులు దుజానాపై ఉన్నాయి. అతనిపై రూ. 50 వేల రివార్డు కూడా ఉంది. జాతీయ భద్రతా చట్టం, గూండా చట్టంతోసహా అనేక అభియోగాలు అతనిపై నమోదయ్యాడు.

గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని బదల్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దురాజా గ్రామానికి చెందిన అనిల్ దుజానా అసలు పేరు అనిల్ నగర్. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌ను అడ్డాగా చేసుకుని అతను క్రిమినల్ గ్యాంగు నడుపుతున్నాడు. గత నెలలో ఆతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ఝాన్సీలో హతమార్చిన ఎస్‌టిఎఫ్ పోలీసులు మరో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను చంపడం నెలరోజుల్లో ఇది రెండవసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News