Friday, December 27, 2024

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Another gold for India in Archery World Cup

అంటాల్య(టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ 2022లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. టర్కీలోని అంటాల్యలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ రికర్వ్ మిక్స్‌డ్ జట్టు బ్రిటన్‌ను ఓడించిబంగారు పతకాన్ని గెలుచుకుంది. బ్రిటన్ ఆర్చర్లు బయోనీ పిట్‌మాన్,అలెక్స్ వైజ్‌లను భారత ఆర్చర్లు తరుణ్‌దీప్ రాయ్, రిధి షూట్‌ఆఫ్ ద్వారా ఓడించారు. తొలి సెట్‌ను 37 35తో బ్రిటన్ గెలుచుకోగా , రెండో సెట్‌ను 36 33తో భారత్ గెలుచుకుంది. 39 40తో బ్రిటన్ మూడో సెట్ గెలుచుకోగా, నాలుగో సెట్‌ను భారత్ 38 37తో గెలుచుకుంది. చెరో రెండు సెట్లు గెలుచుకోవడంతో ఫలితం కోసం షూట్ ఆఫ్‌కు వెళ్లాల్సి వచ్చింది.అందులో భారత్ 18 17 స్కోరుతో విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News